స్టైరీన్ బాధిత గ్రామాల్లో రేపటికి నమోదు కార్యక్రమం పూర్తవుతుందని... రేపు సాయంత్రానికి ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. గ్రామాల్లో ఇంకా విషవాయువు ఉందనడం అసత్యమన్నారు. ఇలాంటి ఫ్యాక్టరీలు ఎలాంటివి ఉన్నా.. నివేదిక తయారు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ నగరం, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రతిపక్ష నాయకులు ఇంతటి ప్రమాద కాలంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. కరోనా వస్తుందనే భయంతో బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. తెదేపా ఇప్పటికే ప్రజల్లో లేదని.. అది జూమ్ పార్టీ అయిపోయి టీవీలకు పరిమితమైందన్నారు.
కరోనా వస్తుందనే భయంతో బయటకు రాలేదా..?: బొత్స - vishaka gas leakage news
ఎల్జీ పాలిమర్స్ విషవాయువు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. రేపు సాయంత్రానికి ఆర్థిక సాయం అందజేస్తామని వివరించారు.
minister botsa comments on tdp