విశాఖ జిల్లాలో అన్ని ఎంపీపీ (MPP) స్థానాలను వైకాపా సొంతం చేసుకుందని మంత్రి అవంతి శ్రీనివాస్ (Minister Aanthi Srinivas) అన్నారు. తెదేపా ఆవిర్భావం నుంచి భీమిలిలో ఆ పార్టీ అభ్యర్థి ఎంపీపీగా కొనసాగుతుండగా.. మొదటి సారి భీమిలి మండల ఎంపీపీ పదవిని వైకాపా సొంతం చేసుకుందన్నారు. ఈ విజయం తమపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రజలు ఏకపక్షంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) నాయకత్వాన్ని నమ్ముతున్నారన్నారు. ఏ ఎన్నికలు జరిగినా వైకాపాకు తిరుగులేని విజయాన్ని కట్టబెడుతున్నారన్నారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన అవంతి.. క్షేత్రస్థాయిలో నాయకులందరిని సమన్వయ పరుచుకొని అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు.
Avanthi: పరిషత్ విజయం మాపై బాధ్యతను మరింత పెంచింది: అవంతి
పరిషత్ ఎన్నికల్లో(Parishad elections) విజయం తమపై బాధ్యతను మరింత పెంచిందని మంత్రి అవంతి శ్రీనివాస్ (Minister Aanthi Srinivas) అన్నారు. ప్రజలు ఏకపక్షంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నమ్ముతున్నారన్నారని వ్యాఖ్యనించారు.
పరిషత్ విజయం మాపై బాధ్యతను మరింత పెంచింది