జనసేన అధినేత పవన్ కల్యాణ్ మానసిక స్థితి సరిగా లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చాలా పుస్తకాలు చదివే పవన్.. గౌతమ బుద్ధుని చరిత్ర గురించి తెలుసుకోవాలన్నారు. బుద్ధుడు సూచించిన ఉపాసన ధ్యానం చేయాలన్నారు. ధ్యాన కేంద్రం హైదరాబాద్ లోనే ఉందని 10 రోజులు అక్కడ ఉంటే ఆవేశం తగ్గుతుందని చురకలంటించారు. రాజకీయ నాయకులకు కావాల్సింది ఆవేశం కాదని ఆలోచన తో కూడిన సహనం ఉండాలన్నారు. ఓ మంత్రి పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని.. బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు నైతిక విలువలు ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా భాజపాతో మాట్లాడాలని లేనిపక్షంలో ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవాలన్నారు.
ముందు రాష్ట్రానికి వచ్చి మాట్లాడు