"భాజపాలో ఉన్నా.. సుజనా చౌదరిది తెదేపా పాటే" - undefined
రాష్ట్ర రాజధానిని ఇష్టానుసారం మారుస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అని భాజపై ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మండిపడ్డారు. భాజాపాలోకి వెళ్లినా... తెదేపా పాట పాడుతున్నారని విమర్శించారు.
!["భాజపాలో ఉన్నా.. సుజనా చౌదరిది తెదేపా పాటే"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4209406-700-4209406-1566484585493.jpg)
ఎంపీ సుజనా చౌదరి భాజపా వైపు మాట్లాడాతున్నారా లేక తెదేపా వైపా... అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖలో ప్రశ్నించారు. 'రాజధాని మార్చితే విప్లవం వస్తుందని సుజనా అంటున్నారు. వరదలపై కేంద్ర సాయం అందకపోతే విప్లవం వస్తుంది' అని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా మంచిని కోరితే అమరావతి, పోలవరంపై ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు. రాజధానిని మారుస్తామని మంత్రి బొత్స ప్రకటించలేదని స్పష్టం చేశారు. అమరావతికి నిర్మాణ వ్యయం మాత్రమే ఎక్కువ అయినట్లు వ్యాఖ్యానించారని వివరించారు.