ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Minister Avanthi: 'ఆ విధంగా తీర్మానం చేసి చంద్రబాబుకు పంపించండి' - చంద్రబాబు తాజా వార్తలు

ఉత్తరాంధ్ర తెదేపా నేతలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. పరిపాలన రాజధానిగా విశాఖ కావాలంటూ తీర్మానం చేసి పార్టీ అధినేత చంద్రబాబుకు పంపాలని సూచించారు. రాజధానిగా విశాఖను అడ్డుకోవద్దని కోరారు.

minister avanthi srinivas
minister avanthi srinivas

By

Published : Aug 30, 2021, 6:46 PM IST

పరిపాలన రాజధానిగా విశాఖ కావాలని తీర్మానం చేసి పార్టీ అధినేత చంద్రబాబుకు పంపాలని ఉత్తరాంధ్ర తెదేపా నేతలకు మంత్రి అవంతి శ్రీనివాసరావు కోరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై తెదేపాకు చిత్తశుద్ధి ఉంటే.. పరిపాలన రాజధానిని అడ్డుకోవద్దన్నారు. మూడు రాజధానులు, స్టీల్‌ప్లాంట్‌, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై తెదేపా స్పష్టత తెచ్చుకోవాలని డిమాండ్ చేశారు.

ఉత్తరాంధ్ర చర్చా వేదిక అంటూ ఈ ప్రాంత తెదేపా నేతలు సమావేశాలు పెట్టడం ఏంటని మంత్రి అవంతి ప్రశ్నించారు. రాజధానిగా విశాఖను అడ్డుకోవద్దని మంత్రి అవంతి హితవు పలికారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పష్టమైన వైఖరితో ఉండాలని కొరారు.

'తెదేపా నేతలు అభివృద్ధిని అడ్డుకోవద్దు. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మిస్తామంటే అడ్డుకున్నారు. రాజకీయాల గురించి కాకుండా.. విశాఖపట్నం అభివృద్ధి గురించి ఆలోచించండి. పరిపాలన రాజధానిగా విశాఖ అమల్లోకి వస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా ఉండేందుకే మూడు రాజధానులను తీసుకువచ్చాం. పరిపాలన రాజధానిగా విశాఖ కావాలంటూ ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన తెదేపా నేతలు తీర్మానం చేసి చంద్రబాబు పంపించాలి'- మంత్రి అవంతి శ్రీనివాస్

'ఉత్తరాంధ్ర రక్షణ- చర్చా వేదిక' కార్యక్రమం.. ప్రభుత్వంపై విమర్శలు

ఇవాళ విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో 'ఉత్తరాంధ్ర రక్షణ-చర్చా వేదిక' కార్యక్రమం నిర్వహించింది. ఈ చర్చలో ఉత్తరాంధ్ర తెదేపా ముఖ్యనేతలు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం ఉత్తరాంధ్రకు న్యాయం చేయకపోగా.. తీవ్ర అన్యాయం చేస్తోందని తెదేపా నేతలు ఆరోపించారు. జగన్ పాలనలో వెనకబడిన ఉత్తరాంధ్ర పరిస్థితి మరింత దిగజారిపోయిందని తెలుగుదేశం పార్తీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ రెండున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై ఒక్కరూపాయి ఖర్చు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 5, 10 శాతం పనులు పూర్తిచేస్తే ఎన్నో రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఉత్తరాంధ్ర నేతలు కనీసం సీఎం జగన్‌ వద్దకు వెళ్లి అడిగే పరిస్థితులే లేవని అచ్చెన్న విమర్శించారు.

వైకాపా ప్రభుత్వం ఉత్తరాంధ్రకు న్యాయం చేయకపోగా.. తీవ్ర అన్యాయం చేస్తున్నారని కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కక్ష సాధింపు చర్యలతో వైకాపా ప్రభుత్వం నడుస్తోందని తెదేపా నేత నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. ఉత్తరాంధ్రకు తెదేపా హయాంలో పరిశ్రమలు వస్తే.. వైకాపా ప్రభుత్వం వెళ్లగొట్టిందని బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. ఉత్తరాంధ్రలో తెదేపా అభివృద్ధి తెలియజేస్తూ బస్సు యాత్ర చేస్తామని అన్నారు. రాష్ట్రం ల్యాండ్, సాండ్​, మైన్... ఈ మూడు పాలసీలతో నడుస్తోందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. దోచుకోవడం దాచుకోవడంలో జగన్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి

క్లైమాక్స్​కు అమెరికా-అఫ్గాన్ కథ.. డెడ్​లైన్​కు 24 గంటలే!

ABOUT THE AUTHOR

...view details