సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి: అవంతి - comments
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ మహిళలకు సూచించారు. పొదుపు సంఘాల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
minister-avanthi-srinivas
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు సూచించారు. విశాఖ ఆరిలోవలోని పొదుపు సంఘాల మహిళల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తిచేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను బడికి పంపి అమ్మఒడి పథకంలో భాగస్వామ్యం కావాలని చెప్పారు.