వ్యవసాయాధారిత కుటుంబాల్లో పాడి తప్పనిసరి. పల్లెల్లో ఒకప్పుడు పశువులది కీలకపాత్ర. రైతులు పాడి పరిశ్రమను కూడా తమ దైనందిత జీవితంలో భాగంగానే పరిగణించే వారు. విశాఖ గ్రామీణ జిల్లా రైతులకు పాడి పరిశ్రమ పెద్ద దిక్కుగా ఉంది. జిల్లాలో విశాఖ డెయిరీ ఖరీఫ్ వ్యవసాయ పనులకు గాను రూ.15.25 కోట్లను పాడి రైతులకు పంపిణీ చేస్తుంది. గ్రామాల్లోని "పాల ఉత్పత్తి దార్ల సంస్థ" ద్వారా నగదు పంపిణీ జరుగుతుండటంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
పాడిని నమ్ముకుంటే... ఆ ఇంట పంట పండినట్టే! - villages
పల్లె జీవనంతో పాడిది విడదీయరాని బంధం. పశువును నమ్ముకుంటే... కూటికి కొదవే లేదన్నది రైతుల నమ్మకం. ఆ బాటలోనే పయనిస్తోంది విశాఖ గ్రామీణం. ఫలితంగా... పల్లె సిరులతో కళకళలాడుతోంది.
పాడిని నమ్ముకున్న ఇంట... పంట పండినట్టే!