ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎందుకింత నిర్లక్ష్యం? కరోనా అంటే లేదా భయం?

By

Published : May 20, 2021, 12:07 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో.. వ్యాపారాల విషయంలో స్థానిక మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపే క్రయవిక్రయాలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని.. కొందరు ఏ మాత్రం లెక్క చేయడం లేదు. మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారాలు కొనసాగిస్తున్న తీరుతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

no lock down in narsipatnam
అధికారులు ఆదేశాలు పట్టించుకోని వ్యాపారులు

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పురపాలక సంఘం.. ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో.. పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే.. క్రయవిక్రయాలు అనుమతిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. కానీ.. కొందరు వ్యాపారులు మాత్రం మధ్యాహ్నం 12 గంటల వరకూ విక్రయాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు.. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వ్యాపారం చేస్తున్నారు.

వ్యాపారుల తీరుపై.. స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పురపాలక సంఘం నుంచి ఆదేశాలు వెలువడినా పట్టింపు లేకపోవడం ఏంటన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల జనం గుంపులుగా చేరుకున్నారని.. ఇలా అయితే కరోనా వ్యాప్తి ఆగుతుందా.. అన్న ఆందోళనను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా.. ఆ కొందరు.. తీరు మార్చుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details