ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాణాలు కాపాడుతోంది... ప్రైవేటీకరణ వద్దు'

By

Published : Apr 22, 2021, 12:25 PM IST

Updated : Apr 22, 2021, 12:35 PM IST

ప్రభుత్వ రంగంలో ఉండటం వల్లే... విశాఖ స్టీల్ ప్లాంట్ అన్ని ఉక్కు కర్మాగారాల కంటే తక్కువ ధరకే ఆక్సిజన్ అందించగలుగుతోందని ఐఎన్​టీయూసీ జిల్లా కార్యదర్శి రామచంద్రరావు అన్నారు. ఇప్పటికైనా కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

oxygen supply
విశాఖ స్టీల్ ప్లాంట్

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయం మార్చుకోవాలంటున్న ఐఎన్​టీయూసీ జిల్లా కార్యదర్శి

విశాఖ స్టీల్ ప్లాంట్ అతి తక్కువ ధరకే మెడికల్ ఆక్సిజన్​ను సరఫరా చేస్తోందని ఐఎన్​టీయూసీ జిల్లా కార్యదర్శి రామచంద్రరావు ప్రశంసించారు. దేశంలో అన్ని ఉక్కు కర్మాగారాల కంటే తక్కువ ధరకే వైద్య అవసరాలకు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాణ వాయువును అందిస్తోందన్నారు. ప్రభుత్వ రంగంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండటం కారణంగానే... తక్కువ ధరకు ఆక్సిజన్ లభిస్తోందని చెప్పారు.

యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ లోడింగ్..

విశాఖ స్టీల్ ప్లాంట్ లో మెడికల్ ఆక్సిజన్ లోడింగ్ యుద్ధప్రాతిపదికన జరుగుతోందన్నారు. సంస్థ ఉద్యోగులు మూడు షిఫ్టుల్లో... 24 గంటలు శ్రమిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పాటుపడుతున్నారని ఆయన కొనియాడారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ... విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

Last Updated : Apr 22, 2021, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details