విశాఖ పాడేరు డివిజన్ డీఎస్పీ ఎదుట ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగి పోయారు. గతంలో వీరు మావోయిస్టుల కార్యకలాపాల్లో సహకారం అందించినట్లు డీఎస్పీ రాజ్‌కమల్ తెలిపారు. మన్యంలో మావోయిస్టు అలజడిలో బ్యానర్లు, పోస్టర్లు అతికించడం వంటి కొన్ని దుశ్చర్య కు వీరు పాల్పడ్డారని చెప్పారు. ప్రస్తుతం మావోయిస్టు కార్యకలాపాలు నచ్చకే వారికి దూరంగా ఉంటున్నట్లు లొంగిపోయిన వారు తెలిపారన్నారు. చాలామంది మిలీషియా సభ్యులు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని వారు ప్రకటించారు. చిన్నప్పుడు నుంచి యువత పక్కదారి పట్టి మావోయిస్టుల్లో చేరడంతో ప్రస్తుతం వారి జీవితం ఆగమ్యగోచరంగా ఉందన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అందించే రివార్డులు, స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ, వ్యవసాయం పై ప్రోత్సహిస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ ముగ్గురు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వాసులని తెలిపారు.
పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యులు - paderu
ముగ్గురు మావోయిస్టు మిలిషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. కొంత కాలంగా వీరు మావోయిస్టు కార్యకలపాల్లో సహకారం అందించినట్లు పాడేరు డీఎస్పీ తెలిపారు.
పాడేరు