ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏవోబీలో మావోల కరపత్రాల కలకలం - posters

భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన తమ దళ సభ్యుల సేవలను గుర్తు చేసుకునేందుకు... మావోయిస్టులు వారోత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. వీటిని జయప్రదం చేయాలంటూ ఏవోబీ సరిహద్దులో పెద్ద ఎత్తున కరపత్రాలు వెదజల్లారు.

మావోలు

By

Published : Jul 25, 2019, 12:05 AM IST

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో మావోల కరపత్రాలు కలకలం రేపాయి. ఈ నెల 28 నుంచి జ‌ర‌గ‌బోయే మావోయిస్టు అమ‌ర‌వీరుల వారోత్స‌వాల‌ను జ‌య‌ప్ర‌దం చేయాల‌ని ఈ పత్రాల్లో ఉంది. అమరవీరులైన తమ దళ సభ్యుల త్యాగాల‌ను గుర్తు చేస్తూ వాడ‌వాడ‌లా వారోత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని, వారి జీవిత చరిత్ర‌ల‌ను అంద‌రికీ తెలియ‌జేయాల‌ని పేర్కొన్నారు. మ‌ల్క‌న్‌గిరి, కోరాపుట్‌, విశాఖ‌ప‌ట్నం డివిజ‌న్ క‌మిటీ పేరు మీద ఈ క‌ర‌ప‌త్రాల‌ను ఏవోబీలో ప‌ప్పులూరు, క‌ప్ప‌తొట్టి ప్రాంతాల్లో వెద‌జ‌ల్లారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details