ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​ బూటకపు మాటలను ప్రజలు నమ్మొద్దు - visakha

ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తే జగన్​ మాటలను నమ్మి మోసపోవద్దని మావోయిస్టు పార్టీ తూర్పు మాల్కాన్​గిరి డివిజన్ కమిటీ ప్రకటన చేసింది.

మావోయిస్టు ప్రెస్​ నోట్

By

Published : Aug 23, 2019, 9:10 AM IST

మావోయిస్టు ప్రెస్​ నోట్

ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ప్రజలను సంస్కరణల భ్రమల్లో ముంచెత్తుతున్నారని, ముఖ్యంగా బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా గత ప్రభుత్వం ఇచ్చిన 97 జీవోను రద్దు చేసి మన్యం ఆదివాసీలకు ఎప్పటికీ రుణపడి ఉండే దేవుడిగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు, నిరోద్యుగులకు, అన్ని వర్గాలవారికి తాయిలాలు ఇచ్చి అధికారాన్ని స్థిర పర్చడానికి ముఖ్యమంత్రి జిమ్మిక్కులు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చేస్తున్న సంస్కరణలు మన్యంలోని ఆదివాసీల పోరాటాలను అణచివేసి తన దోపిడిని కొనసాగించడానికి వేస్తున్న ఎత్తుగడలో భాగమేనని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. నాలుగు దశాబ్దాలుగా మన్యంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ఆదివాసీ ప్రజలు సమరశీల పోరాటాలను చేసి అడవిపై హక్కు ఆదివాసీలదేనంటూ పలు పోరాటాలను చేసి విజయవంతం అయిందని, ఆ పోరాటాల ఫలితంగానే మన్యంలో బాక్సైట్ తవ్వకాలు, 97 జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించక తప్పలేదని మావోయిస్టు పార్టీ పేర్కొంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details