ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్హత సాధించినా.... నియామక పత్రాలు అందలేదు - సచివాలయాల ఉద్యోగాల భర్తీలో గందరగోళం

గ్రామ సచివాలయాల ఉద్యోగాల నియామకంపై చాలా చోట్ల గందరగోళం నెలకొంది. హార్టికల్చర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించినప్పటికీ తమకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని విశాఖ ఏజెన్సీ గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు.

సచివాలయం

By

Published : Oct 14, 2019, 5:34 AM IST

అర్హత సాధించినా.... నియామక పత్రాలు అందలేదు

గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో హార్టికల్చర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్‌ విభాగాల్లో అర్హత సాధించిన తమకు నియామక ఉత్తర్వులు ఇవ్వడంలేదంటూ, విశాఖ జిల్లాలో నిరుద్యోగులు ఆందోళకు దిగారు. పాడేరుకి చెందిన 30 మందికి పైగా గిరిజన అభ్యర్థులు గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో హార్టికల్చర్- అగ్రికల్చర్‌ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించినట్లు సమాచారం అందింది. ధ్రువపత్రాల పరిశీలన కూడా ముగిసింది. నిబంధనల ప్రకారం హార్టికల్చర్ విభాగంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చేసిన వారు మాత్రమే ఉద్యోగాలకు అర్హులుని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మొదటిదశలో వారు అందుబాటులో లేనందున మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసిన తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details