వైద్యులు తరచూ వస్తున్నారని పాడేరులో యువకుడు పరార్ విదేశాల నుంచి వచ్చినవారు ఇంటి వద్దే ఉండాలని అధికారులు సూచించినా కొంతమంది పట్టించుకోవడం లేదు. విశాఖ జిల్లా పాడేరులో సింగపూర్ నుంచి వచ్చిన ఓ యువకుడు ఎవరికీ కనిపించకుండాపోయాడు. వైద్య సిబ్బంది తరచూ తన ఇంటికి వస్తున్నారని మనస్తాపం చెంది.. ఇంటి నుంచి పరారయ్యాడు. సెల్ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది అతని ఇంటికి పరుగులు తీశారు. వైద్యులు తరచూ రావడం వల్ల తమను ఇరుగు పొరుగు అంటరానివారిగా చూస్తున్నారని యువకుని తల్లిదండ్రులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు.
ఆరోగ్యంగా ఉన్నా పర్యవేక్షిస్తాం...
విదేశాల నుంచి వచ్చినవారు ఆరోగ్యంగా ఉన్నా.. 14 రోజులపాటు పర్యవేక్షణలో ఉంచుతామని పాడేరు వైద్యాధికారి లీలా ప్రసాద్ తెలిపారు. ఇందుకు ఎవరూ అతీతులు కాదని కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. యువకుడు ఎక్కడికి వెళ్లాడో చెప్పాలని తల్లిదండ్రులను కోరారు. అయినప్పటికీ వారు చెప్పకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు యువకుని ఇంటికి విద్యుత్ కనెక్షన్ తొలగించారు. ప్రభుత్వ రేషన్ కార్డు కూడా నిలిపేస్తామని హెచ్చరించారు. యువకుడు ఎక్కడ ఉన్నాడో తెలిసి కూడా.. కుటుంబీకులు చెప్పడం లేదని వైద్య సిబ్బంది అంటున్నారు.
ఇదీ చూడండి:
కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...