ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు తెదేపా ప్రచార సభకు దీదీ, కేజ్రీవాల్ రాక - vishaka

ఈ రోజు విశాఖ తెదేపా ఎన్నికల ప్రచార సభలో పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ పాల్గొననున్నారు. విశాఖలోని ఇందిరాగాంధీ మున్సిపల్​ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది.

నేడు తెదేపా ప్రచార సభకు దీదీ, కేజ్రీవాల్ రాక

By

Published : Mar 31, 2019, 4:43 AM IST

నేడు తెదేపా ప్రచార సభకు దీదీ, కేజ్రీవాల్ రాక
తెదేపా ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంటోంది. జాతీయ నాయకుల రాకతో ప్రచార సభల్లో ఉత్సాహం పెరుగుతోంది. ఈ రోజు విశాఖ తెదేపా ఎన్నికల ప్రచార సభలో పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ పాల్గొననున్నారు. విశాఖలోని ఇందిరాగాంధీ మున్సిపల్​ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది. ఇప్పటికే కేజ్రీవాల్ విజయవాడలో చంద్రబాబుతో కలిసి రోడ్డు షోలో పాల్గొన్నారు. తెదేపాకు మద్దతుగా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లా కడప, కర్నూలు జిల్లాల్లో చంద్రబాబుతో కలిసి ప్రచారం నిర్వహించారు. భాజపా వ్యతిరేక పార్టీల కూటమిని బలపర్చడంలో భాగంగా ఎన్నికల్లో చంద్రబాబుకు జాతీయ నేతలు మద్దతు పలుకుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details