ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం- ప్రియుడు మృతి - కైలాసగిరి

వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి బ్రతకాలనుకున్నారు. కానీ ఏం కష్టమొచ్చిందో కలిసి ప్రాణాలు వదలాలని నిర్ణయించుకున్నారు. విషం తాగి బలవన్మరణ యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా.. ప్రియురాలు ప్రాణాలతో పోరాడుతోంది.

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం- ప్రియుడు మృతి

By

Published : May 12, 2019, 10:58 AM IST

విశాఖలోని పర్యటక ప్రాంతం కైలాసగిరిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. బాదంపాలల్లో విషం కలిపి తాగి బలవన్మరణానికి ప్రయత్నం చేసింది. ఈ దుర్ఘటనలో ప్రియుడు అక్కడికక్కడే మృతిచెందగా, ప్రియురాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. 108 వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. వీరిని శ్రీకాకుళం జిల్లా ఆడారికి చెందిన సత్యనారాయణ, కమలగా గుర్తించారు. ఈ మధ్యే కమల కుటుంబం గాజువాకకు నివాసం మార్చినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఉన్న 2 సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం- ప్రియుడు మృతి

ABOUT THE AUTHOR

...view details