జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా పాడేరు ప్రథమశ్రేణి జ్యుడిషియల్ కోర్టులో న్యాయమూర్తి శారద,అపరిష్క్రతంగా ఉన్న350కేసులను పరిష్కరించారు.ఇరు పక్షాల అంగీకారంతో రాజీ కుదిర్చారు.ఎక్కువగా ఎక్సైజ్ పరిధిలో338కేసులు ఉండటం గమనార్హం.గిరిజనులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగటం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె తెలిపారు.ప్రతిసారి నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు వినియోగించుకుని కేసులను పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి శారద సూచించారు.
లోక్ అదాలత్ లో 350 కేసుల పరిష్కారం - paderu
విశాఖ జిల్లా పాడేరులోని ప్రథమశ్రేణి జ్యుడీషియల్ కోర్టులో న్యాయమూర్తి శారద ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. అపరిష్క్రతంగా ఉన్న 350 కేసులను పరిష్కరించారు.
లోక్ అదాలత్