ప్రతీ ఏటా మే నెలాఖరుకు కేరళను తాకే నైరుతి రుతుపవనాలు...ఈ ఏడాది జూన్20వరకు పలకరించలేదు.రుతుపవనాలు వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ సరైన వర్షపాతం నమోదు కాలేదు.భూతాపం,స్థానిక వాతావరణ మార్పుల వల్ల వర్షాలు సరైన సమయంలో కురవడంలేదని నిపుణులు అంటున్నారు.నెలలు తరబడి పడే తొలకరి జల్లులు..రోజులకే పరిమితమైతాయని హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలం...నెలలు కాదు..రోజులే... - వర్షాకాలం
ఈ ఏడాది రుతుపవనాలు రాష్ట్రాన్ని ఆలస్యంగా పలకరించాయి. వర్షాలు తగినంత కురుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే.. వరుసగా నెలల తరబడి వర్షం కురిసే పరిస్థితి లేదు. కేవలం రోజుల వ్యవధిలో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తక్కువ రోజుల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందంటున్న నిపుణులు...అందుకు అనుగుణంగా వ్యవసాయ, నీటి నిల్వ దారులు ప్రణాళికలు వేసుకోవాలని సూచిస్తున్నారు.
కురిసిన కొద్దిపాటి వర్షపు నీటిని ఒడిసిపట్టుకుని..నీటి ఎద్దడిని అదిగమించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.పరిశోధనలకు ప్రోత్సాహం లాంటి శాస్త్రీయ చర్యలే కాకుండా...ఆయా పర్యవసానాలను నియంత్రించే విధానాలపైనా కృషి జరుగుతోంది.
నైరుతి పవనాలు రాష్ట్రాన్ని పలకరించినా..స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయని..నిపుణులు చెబుతున్నారు. వర్షాలు అన్ని ప్రాంతాల్లో ఒకేసారి కురిసే అవకాశం లేదంటున్నారు. వర్షపు నీటిని సరైన పద్ధతిలో వినియోగించుకుని కరవును అధిగమించాలని సూచిస్తున్నారు.వర్షం నీటిని నిల్వ చేసేందుకు సరైన ప్రణాళికలు రూపొందించి..నీటి ఎద్దడిని అధిగమించాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.