మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ 108వ బ్రాంచ్ విశాఖలో ప్రారంభమైంది. వి.హోటల్ అధినేత జి. వెంకటేశ్వరరావు మధురవాడ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్గదర్శి అంటేనే నమ్మకమని అన్నారు. ‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై నమ్మకం, విశ్వాసం కారణంగా సంస్థ సభ్యుల సంఖ్య 4.5 లక్షలకు చేరిందని, సంస్థ టర్నోవర్ కూడా రూ.12 వేల కోట్లు దాటిందని వెల్లడించారు. రామోజీరావు స్ఫూర్తితో ఎండీ శైలజా కిరణ్ సంస్థను విజయపథంలో నడిపిస్తున్నారని తెలిపారు. బ్రాంచి మేనేజర్ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ.50 లక్షల ఆక్షన్ టర్నోవర్‌తో సంస్థను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రూ.లక్ష నుంచి రూ.25 లక్షల వరకు చిట్టీలు అందుబాటులో ఉంటాయని వివరించారు. మధురవాడ ప్రాంతవాసులకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కొత్త శాఖను ఇక్కడ ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ‘ఈనాడు’ విశాఖపట్నం యూనిట్ మేనేజర్ అన్నే శ్రీనివాస్, డాల్ఫిన్ హోటల్ జీఎం రామకృష్ణ, శరత్, మార్గదర్శి సీనియర్ మేనేజర్ వై.బి.రాజేంద్రప్రసాద్, పలు శాఖల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
నమ్మకానికి మరో పేరు ‘మార్గదర్శి’ - Margadarshi Chit Fund news
ప్రముఖ చిట్‌ఫండ్ సంస్థ ‘మార్గదర్శి’ 108వ శాఖ విశాఖలో అందుబాటులోకి వచ్చింది. పి.ఎం.పాలెం మొదటి బస్‌స్టాప్ సమీపంలో ఏర్పాటుచేసిన మార్గదర్శి మధురవాడ శాఖను ప్రముఖ వ్యాపారవేత్త, వి-హోటల్ ఛైర్మన్ గూడపాటి వెంకటేశ్వరరావు గురువారం ప్రారంభించారు.
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ
Last Updated : Jun 25, 2021, 6:01 AM IST