విశాఖ జిల్లా చీడికాడ - పాడేరు మండలాలకు అనుసంధానంగా నిర్మించిన కోనాం - ఈదులపాలెం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి.. రహదారిపై పడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఘాట్ రోడ్డులోని కోనాం జలాశయం సమీపంలో ఈ పరిస్థితి నెలకొంది.
ఆ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తున్నవారు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడగా.. రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.