ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కురుక్షేత్రలో ముగిసిన శ్రీ లక్ష చండీ మహాయజ్ఞం.. భారతదేశ వైదిక చరిత్రలో తొలిసారి

Laksha Chandi Maha Yagnam : ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభమైన శ్రీ లక్ష చండీ మహాయజ్ఞం ఆదివారం పూర్తైంది. 16 రోజుల పాటు సాగిన ఈ యజ్ఞం దేశ చరిత్రలోనే తొలిసారిగా నిర్వహించారు. ఈ క్రతువుకు విశాఖ విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు పర్యవేక్షణ భాద్యత చేపట్టారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 26, 2023, 7:38 PM IST

Updated : Feb 26, 2023, 10:37 PM IST

Laksha Chandi Maha Yagnam : హరియాణా రాష్ట్రంలోని కురుక్షేత్ర సమీపాన షహబాద్‌ వేదికగా శ్రీ లక్ష చండీ మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 10వ తేదీన మండప ప్రవేశంతో ప్రారంభమైన యజ్ఞం మహా పూర్ణాహుతితో ముగిసింది. 55 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 16 రోజులపాటు క్రతువు నిర్వహించారు. ఈ క్రతువులో 1760 మంది రుత్విక్కులు పాల్గొన్నారు. ఈ కార్యానికి గుంతి ఆశ్రమం నిర్వహణ చేపట్టగా.. బాధ్యత విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది.

ఆదివారం ఉదయం పరివార దేవతలకు హవనాలు నిర్వహించారు. ఆ తర్వాత అనంతరం ప్రాయశ్చిత్త హోమాలు చేపట్టారు. అనంతరం అతిరుద్ర, చండీ ప్రధాన హోమ గుండాల వద్ద బలిహరణ నిర్వహించారు. బలిహరణ నిర్వహించిన తర్వాత శాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి చేపట్టారు. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూర్ణాహుతి ఘట్టం ముగిసింది.

యజ్ఞం ముగిసిన తర్వాత గుంతి ఆశ్రమ ప్రాంగణంలోని దేవతామూర్తుల విగ్రహాలను యాగ జలాలతో సంప్రోక్షణ చేశారు. శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం నిర్వహించిన మొట్టమొదటి ప్రాంతంగా కురుక్షేత్రలోని గుంతి గ్రామం చరిత్రలో నిలిచిపోతుందని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. లోక కల్యాణం కోసం రాజుల కాలంలో యజ్ఞాలు చేసే వారని చరిత్ర ద్వారా తెలుసుకున్నామని.. ఇప్పుడు కళ్లారా చూస్తున్నామని తెలిపారు. కచ్చితంగా ఇది దేశానికి శుభం చేకూరుస్తుందని ఆకాంక్షించారు.

యజ్ఞాన్ని పర్యవేక్షించే భాద్యత విశాఖ శ్రీ శారదాపీఠానికి దక్కడం గొప్ప అవకాశమని ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి అన్నారు. పూర్ణాహుతి అనంతరం చండీమాతకు మహా మంగళ హారతినిచ్చారు. యజ్ఞం ముగియడంతో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి కురుక్షేత్ర నుంచి రిషికేష్ వెళ్లారు. హరియాణాలో చేపట్టిన ఈ యజ్ఞం దేశ సంక్షేమం కోసం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అష్టోత్తర శత కుండాత్మక అప్రతిహత లక్ష చండీ మహాయాగంమని ఈ యజ్ఞానికి నామకరణం చేశారు. ఈ యాగంలో పాల్గొన్న పండితులలో అధికంగా.. ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, కర్ణాటక నుంచి ఉన్నారు.

కురుక్షేత్రలో ముగిసిన శ్రీ లక్ష చండీ మహాయజ్ఞం

ఇవీ చదవండి :

Last Updated : Feb 26, 2023, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details