ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంట పొలాల్లో చేపల వేట - విశాఖ పంట కాలువల పై ప్రత్యేక కథనం

విశాఖ జిల్లాలో వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. జిల్లాలో జలాశయాలు, వాగులు పొంగుతున్నాయి. పంట పొలాలు సైతం చేపల చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల పొలాల్లో స్థానికులు చేపల వేట ప్రారంభించారు.

vishaka rain
పంట పొలాల్లోనే చేపల వేట

By

Published : Oct 6, 2020, 2:48 PM IST

విశాఖ జిల్లాలో వర్షాలు తగ్గటం లేదు. జలాశయాల్లో నీటి మట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. సాగు నీటి చెరువులు, పంట కాలువలు కొత్తనీటితో కళకళలాడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పొలాలు సైతం చెరువులను తలపిస్తున్నాయి.

నర్సీపట్నం డివిజన్​లోని రోలుగుంట, రావికమతం, మాకవరపాలెంలో.. వరి పొలాలు వరదలో మునిగిపోయాయి. చెరువుల నుంచి పొలాల్లోకి నీటితో పాటు.. అందులో ఉన్న మత్స్య సంపద సైతం చేరుతోంది. గమనించిన స్థానికులు పొలాల్లో చేపలు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details