ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలి:కొణతాల - konathala

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాల్సిన అవసరం ఉందిని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ తెలిపారు.

మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలి:కొణతాల

By

Published : Mar 27, 2019, 7:54 AM IST

మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలి:కొణతాల
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాల్సిన అవసరం ఉందిని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి గౌరీ సేవా సంఘం వద్ద నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.... రాష్ట్రంలో వైకాపా ప్రతిపక్ష పాత్ర పోషించలేదని... ప్రజా సమస్యలపై కనీస పోరాటం చేయలేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని... సాధ్యం కాని పరిస్థితిలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని.. నరేంద్ర మోదీ నమ్మించి మోసం చేశారన్నారు. ధర్మపోరాట దీక్షలతో చంద్రబాబు పోరాటాలు చేస్తున్న... కేంద్రం పట్టించుకోలేదని వివరించారు. ప్రధాని మోదీ 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆగ్రహానికి గురయ్యారని తెలిపారు. మొదటి నుంచి తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెప్పుకునే వైకాపా.... హోదా ఇవ్వని భాజపాతో జతకట్టారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైనే తొలి సంతకం ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పిన సంగతి గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి....

ABOUT THE AUTHOR

...view details