ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపా సిద్ధమే: కళా - Kala Venkat rao

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపా సిద్ధమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు పేర్కొన్నారు. తెదేపాకు క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలే బలమని ఉద్ఘాటించారు.

కళా వెంకట్రావు

By

Published : Jul 26, 2019, 11:35 PM IST

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెదేపాపై బురదజల్లడమే సీఎం జగన్​ పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. విశాఖ జిల్లా అనకాపల్లి జరిగిన ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వర రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై దృష్టి పెట్టకుండా... గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్ర సమయంలో మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పిన జగన్... దీన్ని అమలు చేయమని అడుగుతుంటే ప్రతిపక్షంపై దురుసుగా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ సీఎం స్థాయిలో మాట్లాడటం లేదన్న కళా... వాడే భాష, హావభావాలు ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

కళా వెంకట్రావు

ABOUT THE AUTHOR

...view details