ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కళ్యాణ మండపాన్ని ఇంత సుందరంగా ఎన్నడూ చూడలేదు' - vishakapatnam latest news

ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ట్రైబ్యునల్ ఛైర్మన్ న్యాయమూర్తి హరనాథ్... శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు స్వాగతం పలికి వేద ఆశీర్వాదం, ప్రసాదాలను అందించారు.

శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్న న్యాయమూర్తి హరినాథ్
శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్న న్యాయమూర్తి హరినాథ్

By

Published : Sep 16, 2021, 10:53 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ట్రైబ్యునల్ ఛైర్మన్ న్యాయమూర్తి హరనాథ్... శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు స్వాగతం పలికి వేద ఆశీర్వాదం, ప్రసాదాలను అందించారు. ఇటీవల ఆలయంలో జరిగిన అభివృద్ధిపై న్యాయమూర్తి హరినాథ్ ప్రశంసల జల్లు కురిపించారు.

విశాఖలో న్యాయమూర్తిగా పని చేసినప్పటి నుంచి తాను తరచూ స్వామివారిని దర్శించుకుంటున్నానని... కళ్యాణ మండపాన్ని ఇంత సుందరంగా ఎన్నడూ చూడలేదన్నారు. లక్ష్మీనారాయణ వ్రతం కోసం ప్రత్యేక మండపాన్ని మొదటిసారి చూస్తున్నానన్నారు. ఆలయంలో పరిశుభ్రత - పచ్చదనానికి ఈఓ సూర్యకళ పెద్దపీట వేశారని ప్రశంసించారు.

ఇదీ చదవండి:

'మైనారిటీ సబ్ ప్లాన్​ను విరమించుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details