విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న కారణంగా ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ ని అరికట్టడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖ జిల్లా ఎస్పీ అట్టాడ బాబుజీ తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో 'సబ్ డివిజన్ క్రైమ్' పోలీసులు సమావేశమయ్యారు. కళాశాలల్లో ర్యాగింగ్‌ను అరికట్టేలా సదస్సులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. వేసవి కాలంలో దొంగతనాలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు. గంజాయి రవాణాను అరికట్టేలా నిఘా పెట్టామని వివరించారు.
'అనకాపల్లి సబ్ డివిజన్ క్రైమ్' సమావేశం - sp meeting_about about raging and eve teasing
విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ ని అరికట్టడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అట్టాడ బాబుజీ తెలిపారు.
sp meeting
TAGGED:
jilla_sp_meeting