'ఆహార వృథాను అరికడదాం.. ఆకలిని తరిమేద్దాం' - world hungry day
నేడు ప్రపంచ ఆకలి దినోత్సవం నేపథ్యంలో జనసేన నేత వీవీ లక్ష్మీనారాయణ విశాఖ ప్రేమ సమాజంలో ఆహార పంపిణీ చేశారు. అక్కడ ఉన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా విశాఖ ప్రేమ సమాజంలో మాజీ ఐపీఎస్ అధికారి, జనసేన నేత వీవీ లక్ష్మీనారాయణ ఆహారం పంపిణీ చేశారు. తోడు, నీడ కోల్పోయి ప్రేమ సమాజంలో నివసిస్తున్న పిల్లలు, వృద్ధులు, మహిళలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. చిన్నారుల చదువు ఎలా సాగుతుందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారందరికీ భోజనాన్ని వడ్డించారు. శుభకార్యాల్లో ఆహారం వృథా కాకుండా ఆకలితో అలమటిస్తున్న వారికి పంచితే దేశంలో ఆకలి చావులు తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కోనసీమ ఆహార నిధి సంస్థ ద్వారా ఇవాళ ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని లక్ష్మీనారాయణ అన్నారు.