ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాతి అని… లక్షా 9,308 కోట్ల రూపాయల మేర బడుగుల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా అందిస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో 60 శాతం మంది బడుగులకు ప్రాతినిధ్యం ఇచ్చారని అన్నారు.
50 శాతం నామినేటెడ్ పోస్టులను బడుగులకు కేటాయించారని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బడుగుల సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.