ప్రతి ఇంటికి తాగునీరు అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలజీవన్ మిషన్ సభ్యులు సంజీవ్ కుమార్ శర్మ, పార్థసారథి తెలిపారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం గొలగాంలో పర్యటించిన జలజీవన్ మిషన్ సభ్యులు... గ్రామంలో ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయడానికి రూ.40 లక్షలు మంజూరు అయ్యాయని అన్నారు. పనులు చేపట్టే ముందు స్థానికులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో తాగునీటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు స్పష్టం చేశారు.
'ప్రతి ఇంటికి తాగునీరు అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు' - visakha dist latest news
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం గొలగాంలో జలజీవన్ మిషన్ సభ్యులు పర్యటించారు. స్థానికులతో సమావేశం నిర్వహించి చేపట్టబోయే పనులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. రూ.40 లక్షలతో గ్రామంలో ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
జలజీవన్ మిషన్ సభ్యులు