విశాఖ జిల్లా మాడుగులలోని శ్రీ మోదకొండమ్మ అమ్మవారి చరిత్ర, మహిమలపై సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మోదనందన్ క్రియోషన్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి జై మోదకొండమ్మ అని నామకరణం చేశారు. మాడుగుల సంస్థానాధీశుల రాజుల కోట, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా ముందుకు సాగుతోంది. నిర్మాత గోవిందగా, పొలాకి శివ దర్శకత్వం వహిస్తుండగా, కెమెరా ఆర్లి, సంగీతం ఎం.ఎస్ ప్రెస్ అందిస్తున్నారు. ప్రస్తుతం బాహుబలి ప్రభాకర్, విలన్ సత్య ప్రకాశ్, జబర్దస్త్ గణపతి పలువురు నటులపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
మాడుగుల పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ సందడి - సంగీతం ఎం.ఎస్ ప్రెస్
మాడుగుల పరిసర ప్రాంతంలో సినిమా చిత్రీకరణతో సందడి నెలకొంది. శ్రీ మోదకొండమ్మ అమ్మవారి చరిత్ర, మహిమలపై మోదనందన్ క్రియోషన్స్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. బాహుబలి ప్రభాకర్, విలన్ సత్య ప్రకాశ్, జబర్దస్త్ గణపతి పలువురు నటులపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు
మాడుగుల పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ సందడి
Last Updated : Nov 8, 2020, 3:59 PM IST
TAGGED:
movie shooting