ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాఫిక్ నియంత్రణకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చొరవ

ప్రధాన రహదారుల్లో ఆటోలు, జీపుల ఇష్టారాజ్యంగా ఆపి ఉంచడంపై.. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్ స్పందించారు. విశాఖ ఏజెన్సీ పాడేరులో.. ఆయా వాహనాల డ్రైవర్లను తన కార్యాలయానికి పిలిపించి హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని హెచ్చరించారు.

itda project officer warning to auto, jeep drivers in paderu
పాడేరులో ఆటో, జీపు డ్రైవర్లకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హెచ్చరికలు

By

Published : Jan 20, 2021, 4:44 PM IST

విశాఖ ఏజెన్సీ పాడేరులో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ నడుం బిగించారు. ఆటో, జీపు డ్రైవర్లను కార్యాలయానికి పిలిపించి.. ప్రధాన రహదారుల్లో ఇష్టానుసారంగా వాహనాలు నిలపడంపై ప్రశ్నించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడపడితే అక్కడ ఆపవద్దని హెచ్చరించారు.

ప్రయాణికులను అధికంగా ఎక్కించడం, భద్రత ప్రమాణాలు పాటించకపోవడంపై డ్రైవర్లను వెంకటేశ్వర్ నిలదీశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో, ఐటీడీఏ కార్యాలయం సమీపంలో జీపులు ఆపవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నియమాలు అతిక్రమించిన వారిపై పోలీసులకు సమాచారం ఇచ్చి కేసులు పెట్టిస్తామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details