ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి'

By

Published : Apr 2, 2021, 5:34 PM IST

విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఐఎన్​టీయూసీ జిల్లా అధ్యక్షుడు మంత్రి రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం ఆదివారం సాయంత్రం విశాఖ సాగరతీరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

intuc
ఐఎన్​టీయూసీ విశాఖ పరిశ్రమ తాజా వార్తలు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఐఎన్​టీయూసీ డిమాండ్ చేసింది. వైజాగ్ జర్నలిస్ట్​ ఫోరం ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశం నిర్వహించింది. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం ఆదివారం సాయంత్రం విశాఖ సాగరతీరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఐఎన్​టీయూసీ జిల్లా అధ్యక్షుడు మంత్రి రాజశేఖర్ తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల దారి పట్టేందుకు సొంత గనులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ నెల 12న జరగనున్న హైపవర్ కమిటీ సమావేశంలో కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసేందుకు నిర్ణయించిందని తెలుగు శక్తి వ్యవస్థాపకులు బీవీ శ్రీరామ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ విషయం తెలిసినప్పటికీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ ఆమోదించడం లేదని అన్నారు. స్పీకర్, ముఖ్యమంత్రి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:కొత్త కార్యాచరణతో ఉద్యమానికి సిద్ధమౌతున్న కార్మిక సంఘాలు

ABOUT THE AUTHOR

...view details