ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డోలీలో తీసుకెళ్లినా... బిడ్డను కాపాడలేకపోయారు

విశాఖ మన్యం పాడేరు మండలం ఓ కుగ్రామంలో నిండు గర్భిణీని డోలీలో 5 కిలోమీటర్లు మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రసవించిన ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.

By

Published : Jun 6, 2019, 12:52 PM IST

Breaking News

విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తియ్యనిగెడ్డ గ్రామంలో ఓ గర్భిణీ పురిటి నొప్పులతో బాధ పడుతుంటే వారి బంధువులు 108 ఫోన్ చేశారు. ఆసుపత్రి సిబ్బంది గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త పొలం గ్రామానికి చేరుకున్నారు. ఆశ కార్యకర్తతో కలిసి కుటుంబ సభ్యులు సుమారు 5 కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకొచ్చి అంబులెన్స్​ వద్దకు చేర్చారు. అక్కడి నుంచి సమీపంలోని మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గర్భిణిని తరలించారు. అక్కడే అతి కష్టమ్మీద ప్రసవించిన ఆ మహిళకు... పండంటి మగబిడ్డ పుట్టాడు. బంధువులంతా సంతోషించారు. వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అతి తక్కువ బరువుతో పుట్టిన ఆ శిశువు... తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమంగా ఉన్న చిన్నారిని... పాడేరు నవజాత శిశు కేంద్రానికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడా పసివాడు.

డోలీలో తీసుకెళ్లారు... బిడ్డని కాపాడలేకపోయారు

ABOUT THE AUTHOR

...view details