ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిశ్రమను తరలించడమే ఉత్తమం: ఇన్​స్వారెబ్

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంస్థ, ప్రభుత్వమూ బాధ్యత వహించాలని ఇన్​స్వారెబ్ ఎన్జీవో సంస్థ పేర్కొంది. పరిశ్రమను వేరే చోటుకు తరలించడమే మంచిదని పేర్కొంది.

INSWAREB on lg polymer incident
విశాఖ ఘటనపై ఇన్స్వర్బ్ సంస్థ

By

Published : May 11, 2020, 8:37 PM IST

విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనకు ఏల్జీ పాలిమర్స్ సంస్థ, ప్రభుత్వ విభాగాలు రెండూ కారణమని ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ సాలిడ్​ వేస్ట్​ రీసర్చ్ & ఎకాలజీ బ్యాలెన్స్ (ఇన్​స్వారెబ్​-INSWAREB) సంస్థ పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితులను చక్కదిద్దటానికి రెండే మార్గాలున్నాయని... ఒకటి స్థానికులకు వేరేచోట వసతి కల్పించడం, పరిశ్రమను వేరేచోటుకు మార్చటమేనని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ప్రజలు ఆవేదనతో ఉన్నారని.. పరిశ్రమ నడపటానికి ఒప్పుకోరని.. ఏల్జీ పాలిమర్స్​ను వేరేచోటుకు మార్చటమే సరైన మార్గమని సూచించింది. ఇన్​స్వారెబ్​ విడుదల చేసిన నివేదికలో ఈ రకంగా పేర్కొంది.

  • గ్యాస్ లీకేజిపై యాజమాన్యం చాలా రకాల కారణాలు చెప్తోంది. రిఫ్రిజిరేటర్లు పాడైనందున...20 డిగ్రీల ఉష్ణోగ్రతను నిర్వరించలేకపోయామని.. పరిశ్రమ తెరిచి చాలా రోజులు అయినందున.. ఉష్ణోగ్రతల్లో తెడాలు వచ్చాయని చెప్తున్నారు.
  • ఘటన జరిగి ఇన్ని రోజులైనా యాజమాన్యం.... గ్యాస్ లీక్​పై కారణాలు బయటకు చెప్పలేదు. తీసుకుంటున్న చర్యలపైనా మీడియాకు తెలియజేయలేదు.
  • పరిశ్రమల ఇన్​స్పెక్టర్​ లాక్​డౌన్ సమయంలో మార్గదర్శకాలు జారీ చేయాల్సింది. బాయిలర్లు, నిల్వ ఉన్న విషమూలకాల నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాల్సింది. అది జరగలేదు.
  • ఇలాంటి ప్రమాదకరమైన రసాయనాలు నిల్వ ఉన్నప్పుడు... ప్రభుత్వం 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం విస్తరణలో నివాసితులకు అనుమతి ఇవ్వకూడదు. పరిశ్రమల ఇన్​స్పెక్టర్​, పీసీబీ ఈ నిబంధనలు అమలు చేయడంలో, ప్రభుత్వానికి జరిగే పరిణామాలపై హెచ్చరించడంలో విఫలమయ్యారు.
  • పట్టణ అభివృద్ధి సంస్థ ప్రమాద ప్రాంతంలోని లేఅవుట్లను ఆమోదించకూడదు
  • రెడ్ జోన్లలో జీవీఎంసీ భవన ప్రణాళికలను ఆమోదించకూడదు.
  • 1961, 2020 మధ్యలో పరిశ్రమ చూట్టూ ఉన్న స్థలం దుర్వినియోగం అయ్యింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎలాంటి పరిష్కారం చూపిస్తారు?
  • ఫ్యాక్టరీ విస్తరణపై పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) అధ్యయనం చేసిందా? ఒకవేళ అధ్యయనం జరిగి ఉంటే.. 'బోగస్'గా ఎందుకు పరిగణించలేదు?
  • వీటన్నిటిపైనా కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ ఉపద్రవానికి ఎవరు కారణమో బయటకు తీసుకురావాల్సి ఉంది.
  • దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా.. సంస్థ లోపాలు, ప్రభుత్వ సంస్థల వైఫల్యాలు బయటకు తీసుకురావాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details