భారత యుద్ద నౌకలు ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ శక్తి... చైనాలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నాయి.
డ్రాగన్ దేశానికి.. ఐఎన్ఎస్ యుద్ధ నౌకలు - ifr
చైనా నేవీ 70వ వార్షికోత్సవం సందర్భంగా భారత్ నుంచి అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకలు ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ శక్తి ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఇందులో పాల్గొంటున్న నౌకలు పరస్పర సహకారం, సాంకేతికత సామర్థ్యం చాటిచెప్పేలా తమ పాటవాలను ప్రదర్శిస్తాయి.
చైనాలోని క్వింగ్డోలో ఈనెల 21 నుంచి జరిగే ఈ ఐఎఫ్ఆర్లో వివిధ దేశాలకు చెందిన యుద్ద నౌకలు పాల్గొంటున్నాయి. చైనా నేవీ 70 వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఐఎఫ్ఆర్ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో పాల్గొంటున్న నౌకలు పరస్పర సహకారం, సాంకేతికత సామర్థ్యం చాటిచెప్పేలా తమ పాటవాలను ప్రదర్శిస్తాయి. దేశీయంగా ఆయా నౌకలు సామర్థ్యాలను సమకూర్చుకున్న తీరును కూడా ఇందులో ప్రదర్శించనున్నారు. క్వింగ్డో లో జరుగుతున్న అంతర్జాతీయ యుద్ద నౌకల ప్రదర్శనలో భారత్ నుంచి పాల్గొంటున్న ఐఎన్ఎస్ కోల్కతా.. మిస్సైల్ విధ్వంసకర నౌక. అత్యాధునిక ఆయుధాలు, శత్రు నౌకలలో ఉండే ఆయుధాలను గుర్తించే సామర్థ్యం దీని సొంతం. ఐఎన్ఎస్ శక్తి యుద్ద నౌకల్లోనే అతి ఎక్కువ సామర్థ్యం ఉన్న టాంకర్ను కలిగి ఉంది. 27 వేల టన్నుల సామర్థ్యమున్న ఈ నౌకలో... 15 వేల టన్నుల లిక్విడ్ కార్గో, 500 టన్నుల ఘన కార్గోలను మోసుకుపోగలదు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక భారత నౌకాదళ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఐఎఫ్ఆర్ సందర్భంగా ఈ రెండు నౌకలు ఇతర నౌకాదళ అధికార్లతో సమావేశాలు, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈనెల 23 న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. ఐఎఫ్ఆర్ను సమీక్షిస్తారు. 2016 ఫిబ్రవరిలో ఐఎఫ్ఆర్.. రెండోసారి భారత్ లో విశాఖ వేదికగా జరిగింది. ఇందులో 50 దేశాల నుంచి 100 యుద్ద నౌకలు ఇందులో పాల్గొన్నాయి.