15 నుంచి విశాఖ-రాజమహేంద్రవరం విమాన సర్వీసులు - indigo airlines
ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ విశాఖ, రాజమహేంద్రవరం ప్రాంత ప్రజలకు శుభవార్త తెలిపింది. ఆయా ప్రాంతాల మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనుంది. కొన్ని రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
విశాఖ, రాజమహేంద్రవరం వాసులకు విమాన సేవలు చేరువకానున్నాయి. ఈనెల 15 నుంచి విశాఖ-రాజమహేంద్రవరం ప్రాంతాల మధ్య విమాన సర్వీసులను ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ప్రారంభించనుంది. రాజమహేంద్రవరంలో సాయంత్రం 5.45 గంటకు బయలుదేరే విమానం సా.6.30 గంటలకు విశాఖ చేరుతుంది. మళ్లీ విశాఖలో సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి రాత్రి 7.40 గంటలకు రాజమహేంద్రవరం వస్తుంది. దీనితోపాటు బెంగళూరు-రాజమహేంద్రవరం- విశాఖ సర్వీసుగా... విశాఖ-రాజమహేంద్రవరం-బెంగళూరు సర్వీసుగా ఇండిగో సంస్థ విమానాలను నడపనుంది.