విశాఖపట్నం జిల్లాలోని మన్యంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. శుక్రవారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగిలో 3.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది రికార్డయిన అతి తక్కువ ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. చలిగాలులు విజృంభించడంతో ఏజెన్సీ ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అది చాలదన్నట్లు మన్యం ప్రాంతమంతా పొగమంచుతో నిండిపోయి... ఏమీ కనిపించట్లేదు.
పొద్దెక్కినా సూర్యుడికి బదులుగా... చీకట్లే కనిపిస్తున్నాయి. పొగమంచు కారణంగా పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎముకలు కొరికే చలిలో ఉన్ని దుస్తులు , రగ్గులు కూడా చలి బారి నుంచి రక్షించలేకపోతున్నాయి. గత సం వత్సరంలాగే ఈసారి కూడా చలి ఎక్కువగా ఉంది. గడచిన ఏడాది 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోయింది