ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీపురుపల్లి జ్ఞాపకార్థం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ - విశాఖ జిల్లా

విశాఖ జిల్లా చీడికాడ మండలం అప్పలరాజుపురం గ్రామానికి చెందిన హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వస్తువులు అందజేశారు. చీపురుపల్లి నరసింహమూర్తి జ్ఞాపకార్థం ట్రస్ట్ నిర్వాహకులు ఈ కార్యక్రమం నిర్వహించారు.

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం

By

Published : Jul 26, 2019, 7:40 AM IST

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం

అప్పలరాజుపురం, బి. సింగవరం, జైతవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు జగదీష్, కార్యదర్శులు చీపురుపల్లి దేముడు నాయుడు సభ్యులతో కలిసి 3 పాఠశాలల్లో విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గంగరాజు, ఏపీటీఎఫ్ టెట్ అధ్యక్ష కార్యదర్శులు అప్పలనాయుడు, వరాహమూర్తి, హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, హెచ్.ఎం.లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details