ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు ధ్వంసం చేశారు...నేడు ప్రతిష్ఠించారు - paderu news

విశాఖ ఏజెన్సీ పాడేరు ఘాట్ రోడ్డు ప్రవేశ మార్గంలో కోమలమ్మ పనుకులో ధ్వంసం చేసిన అమ్మవారి పాదాలను...నేడు కొంతమంది నాయకుల సమక్షంలో స్థానికులు ప్రతిష్ఠించారు.

idol-of-goddess
idol-of-goddess

By

Published : Jan 3, 2021, 6:18 PM IST

Updated : Jan 3, 2021, 7:28 PM IST


విశాఖ ఏజెన్సీ పాడేరు ఘాట్​రోడ్డు ప్రవేశ మార్గంలో కోమలమ్మ పనుకులో ధ్వంసం చేసిన అమ్మవారి పాదాలను తిరిగి నూతనంగా ప్రతిష్టించారు. మూడు రోజుల కిందట అమ్మవారి పాదాలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ భాజపా, తెలుగుదేశం పార్టీలు ఘాట్ రోడ్​లో ధర్నాకు దిగారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే శక్తులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

అమ్మవారి పాదాలు తిరిగి ప్రతిష్ట

నేటి ఉదయం వరకు లేని అమ్మవారు పాదాలు మధ్యాహ్నానికి దర్శనమిచ్చాయి. పోలీసుల సహకారంతో స్థానికులు ప్రతిష్ఠించినట్లు తెలిపారు.

Last Updated : Jan 3, 2021, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details