సింహాచలంలో కొలువైన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి హుండీని లెక్కించారు. స్థానిక బేడా మంటపంలో దేవస్థాన ఈవో ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల వారు వీటిని లెక్కించారు. 19 రోజులకుగాను కోటీ 40 లక్షల 12 వేల 975 రూపాయల ఆదాయం వచ్చింది. నగదుతోపాటు 166 గ్రాముల బంగారం, 20 కేజీల వెండి, విదేశీ కరెన్సీ లభ్యమైంది. ఈనెలలో సుమారు 2 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారని... అందుకే హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు.
సింహాచలం అప్పన్న హుండీ లెక్కింపు - money
సింహాచలం వెలసిన శ్రీ వరాహలక్ష్మీనరసింహ స్వామి హుండీ లెక్కించారు. 19 రోజులకు గాను కోటీ 40 లక్షల 12 వేల 975 రూపాయలుగా అధికారులు లెక్క తేల్చారు.
హుండీ