విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది. స్వామి వారి ఆదాయం కోటి రూపాయలు దాటింది. కొవిడ్ తర్వాత ఇంత ఆదాయం రావడం ఇదే ప్రథమం. 44 రోజుల తర్వాత సింహాద్రి అప్పన్న సన్నిధిలో గురువారం హుండీ ఆదాయాన్ని ఆలయ ఈవో త్రినాథరావు ఆధ్వర్యంలో లెక్కించారు. స్వామి వారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన వివరాలు... నగదు కోటి డెబ్భై ఐదు లక్షల డెబ్భై తొమ్మిది వేల డెబ్భై మూడు రాగా.. బంగారం 000.208 గ్రాములు, వెండి. 11 కేజీల 400 గ్రాములు రికార్డు స్థాయిలో వచ్చాయి. అధిక ఆదాయం రావడంతో ఆలయ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. రానున్న రోజుల్లో భక్తుల రాక మరింత ఆదాయం పెరుగుతుందని.. తద్వారా హుండీ ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
రికార్డు స్థాయిలో సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం - విశాఖపట్నం వార్తలు
విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో కోటి రూపాయలు దాటింది. గురువారం హుండీ ఆదాయాన్ని ఆలయ ఈవో త్రినాథరావు ఆధ్వర్యంలో లెక్కించారు.
రికార్డు స్థాయిలో సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం