ప్రభుత్వం అందజేయనున్న ఇళ్ల పట్టాల పంపిణీకి... లబ్ధిదారుల వివరాల సేకరణ కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయాల వద్ద కోలాహలంగా మారింది. విశాఖ జిల్లా పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్దకు లబ్ధిదారులు భారీ ఎత్తున చేరుకుని క్యూ కట్టారు.
ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా వేసినా... లబ్ధిదారుల వివరాల సేకరణ కొనసాగుతుంది. వివరాలు నమోదు చేసుకునేందుకు... లబ్ధిదారులు భారీ సంఖ్యలో కార్యాలయానికి చేరుకున్నారు. ఏ ఒక్కరూ భౌతిక దూరం పాటించకుండా గుమిగూడారు. దీంతో కరోనా వ్యాప్తి మరింత ఎక్కువవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాయకరావుపేట నియోజకవర్గంలో సుమారు 20 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.