విశాఖ జిల్లా పెదగంట్యాడలో ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమానినే మోసం చేసిందో.. ఓ కుటుంబం. నమ్మకంగా ఉంటూ.. రూ.4 లక్షల 20 వేల నగదు, 7 తులాల బంగారం, వెండి వస్తువులు...అందినకాడికి దోచేసింది. యజమాని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన న్యూపోర్టు పోలీసులు నిందితులను అరెస్టుచేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... పెదగంట్యాడ 62వ వార్డు టీజీఆర్ నగర్లో దవులూరి చంద్రరావు.. కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వానపల్లి సీతారాం, అతని తల్లి పద్మ, సోదరి కుమారితో కలసి... చంద్రరావు ఇంట్లో ఏడాది నుంచి అద్దెకు ఉంటున్నాడు. యజమాని చంద్రరావు భార్య నిర్మలతో చనువుగా ఉంటూ ఏమైనా కుటుంబ సమస్యలు ఉంటే తాము సంతోషిమాత, రాజమ్మ పూజలు చేసి పరిష్కారం చెబుతామని నమ్మబలికారు. ఈ విషయం భర్తకు చెప్పకూడదని, అలా చెబితే అతనికి ప్రాణ హాని కలుగుతుందని నమ్మబలికారు. ఆమె దగ్గరి నుంచి బంగారం, వెండి, నగదు తీసుకున్నారు. పూజల పేరిట మోసం చేశారు. చివరికి అసలు విషయం తెలుసుకున్న నిర్మల విషయాన్ని భర్తకు తెలియజేసింది. చంద్రరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి, నిందితులను అరెస్టు చేశారు.
ఇల్లు అద్దెకిచ్చిన యజమానికే టోకరా...! - పూజల పేరిట ఇంటి యజమానికే టోకరా
అద్దెకు ఇల్లు ఇచ్చిన యజమానికే టోకరా వేసింది శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం. తాము నిత్యం సంతోషిమాత, రాజమ్మ పూజలు చేస్తామని.. కుటుంబ సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని యజమాని భార్యను నమ్మించి.. అందినంత దోచేసింది. చివరికి ఆ కుటుంబం జైలుపాలైంది.
ఇళ్లు అద్దెకిచ్చిన యజమానికే టోకరా...!