ఆంధ్రా యూనివర్సిటీ అనుబంధ ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సమితి ఆధ్వర్యంలో ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు ఏయు రిజిష్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏయూ అనుబంధ కళాశాలగా కొనసాగుతున్న కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజులు నియంత్రిస్తామని హామీ ఇచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రైవేట్ కళాశాలలో ఫీజుల నియంత్రణకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. విద్యను కొనాల్సిందేనా అని ప్రశ్నించారు. ఏయూ వీసీ వి. సత్యనారాయణ వెంటనే అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలల యాజమాన్యాలను పిలిచి మాట్లాడుతానని హామీ ఇచ్చారు.దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
ఏయూ పరిధిలోని కళాశాలల్లో అధిక ఫీజులు.. విద్యార్ధుల ఆందోళన
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ జన జాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు ఏయూ రిజిష్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఏయూ అనుబంధ కళాశాల్లో అధిక ఫీజులను నియంత్రించాలి.
ఇవీ చదవండి
ఆక్రమణలపై ఉక్కుపాదం.... వేగంగా భవనాలు ధ్వంసం