ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ పబ్‌లలో రాత్రి 10 తర్వాత మ్యూజిక్ వద్దే వద్దు: హైకోర్టు - high court to pubs

High Court Orders on Pubs: తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్‌లో.. జనావాసాల మధ్య ఉన్న పబ్‌లలో అర్ధరాత్రి వరకు మ్యూజిక్, సౌండ్ సిస్టమ్స్‌ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. స్థానికులు గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాగా దీనిపై.. పబ్‌లలో రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌కు అనుమతి లేదని హైకోర్టు స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది.

pubs
పబ్‌లు

By

Published : Dec 30, 2022, 7:11 PM IST

High Court Orders on Pubs: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని పబ్‌లలో రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌కు అనుమతి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను మార్చేందుకు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం నిరాకరించింది. జూబ్లీహిల్స్‌లో జనావాసాల మధ్య పబ్‌లలో అర్ధరాత్రి వరకు మ్యూజిక్, సౌండ్ సిస్టమ్స్‌ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి.. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు పబ్‌లలో మ్యూజిక్ ఉండరాదని ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ఈ ఉత్తర్వులను సవరించాలని కోరుతూ మూడు పబ్‌ల యాజమానులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. గతంలో విధించిన ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details