భారీ వర్షాలకు విశాఖ మన్యంలో కొండవాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతపల్లి మండలం తాజంగి అంజలి మధ్య ఉన్న వంతెన పైనుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది దీంతో వంతెన పైనుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొయ్యూరు మండలం కాకరపాడు సమీపంలో కాలువ ఉద్ధృతికి గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి.
పొంగుతున్న వాగులు.. నిలిచిన వాహనాలు - మన్యంలో నిలిచిపోయిన వాహనాలు తాజా వార్తలు
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో విశాఖ జిల్లాలోని మన్యంలో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుండటం రహదారిపై వాహనాలు బారీగా నిలిచిపోయాయి.
విశాఖ మన్యంలో పొంగుతున్న వాగులు నిలిచిన వాహనాలు