విశాఖపట్నం జిల్లా పాడేరు ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొండవాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి గెడ్డ, పాడేరు మండలం గుత్తులపుట్టు మత్యగెడ్డ, పెదబయలు మండలంలోని గేదె గెడ్డలో ప్రవాహ ఉద్ధృతి అధికంగా ఉంది. ఫలితంగా కుంబిడిసింగి వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వర్షాలకు జోలాపుట్ రిజర్వాయర్లో నీటిమట్టం పెరిగింది.
పాడేరు ఏజెన్సీలో వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు - vizag district weather updates
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుంటే విశాఖ పాడేరు ఏజెన్సీలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో ఏజెన్సీలోని వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి.
పాడేరు ఏజెన్సీలో వర్షాలు