మాచకుండ్ కు పోటెత్తిన వరద.. బలిమెలకు విడుదల - rain
అల్పపీడన ద్రోణి ప్రభావంతో మన్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆంధ్ర- ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న... మాచకుండ్ జలవిద్యుత్ కేంద్రానికి వరద పోటెత్తింది.
heavy-rain-in-vishaka
విశాఖ మన్యంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షంతో ఆంధ్ర - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచకుడ్ జల విద్యుత్ కేంద్రానికి వరద పోటెత్తింది. జలాశయం పూర్తిగా నిండి, ప్రమాదకర స్థాయికి చేరింది. 2 వేల 590 అడుగుల సామర్థ్యం గల ప్రాజెక్టు నీటిమట్టం... 2వేల 589 అడుగులకు నీరు చేరింది. ఒక గేటు ఎత్తి 600 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న బలిమెల రిజర్వాయరుకు విడుదల చేస్తున్నారు.