ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో వైద్యురాలు, నర్సు సహా 45 మందికి కరోనా - అనకాపల్లిలో కరోనా వ్యాప్తి

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో కొత్తగా 45 మందికి కరోనా నిర్ధరణ అయింది. వీరిలో స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న దంత వైద్యురాలు, ఓ నర్సు ఉన్నారు.

heavy corona positive cases registered in anakapalli
వైరస్ నిరోధక ద్రావకాన్ని పిచికారీ చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది

By

Published : Aug 26, 2020, 3:18 PM IST

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 45 మందికి కరోనా సోకినట్లు నిర్థరణ అయ్యింది. వీరిలో ఇద్దరు వైద్య సిబ్బంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దంత వైద్యురాలితో పాటు.. నర్సుకు వైరస్ సోకినట్టుగా అధికారులు తెలిపారు.

జీవీఎంసీ ఆధ్వర్యంలో పట్టణంలోని అనేక ప్రాంతాల్లో కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని కొవిడ్ చికిత్స కేంద్రాలతో పాటు, ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించి తగిన చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details