Data Hack: టెలికాం వినియోగదారుల డేటా హ్యాకింగ్‌కు గురైంది. టెలీకమ్యూనికేషన్ల వ్యవస్థను నియంత్రించేశాఖ కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఏపీ ప్రధాన కార్యాలయంలో పలు విభాగాల్లోని కంప్యూటర్లు స్తంభించాయి. సర్వర్‌తో పాటు 50 కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల్లో మాల్‌వేర్ ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లోని కీలక ఫైళ్లన్నీ మాయమయ్యాయి. వీటిని రికవరీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వెంటనే ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి, సైబర్ క్రైం పోలీసులకు అధికారులు తెలిపారు. డేటా రికవరీకి హ్యాకర్లు కోటిరూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. టెలికాం వినియోగదారులతోపాటు నెట్‌వర్క్ ఆపరేటర్ల సమాచారం, సెల్‌టవర్ల లొకేషన్లు, అంతర్జాలం వాడకందారుల డేటా వంటి సున్నితమైన సమాచారం ఇతరులకు చేరిందని భావిస్తున్నారు.
ఏపీ ప్రధాన కార్యాలయంలో కంప్యూటర్ల హ్యాక్.. కోటి రూపాయలు డిమాండ్ - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
Data Hack: సాధారణంగా ఒకే నెట్‌వర్క్‌లో అనుసంధానమైన కంప్యూటర్లకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఫైర్‌వాల్ రక్షణను సర్వర్‌లో ఎనేబుల్ చేసుకుంటారు. దీని వల్ల హ్యాకింగ్, మాల్‌వేర్ దాడుల నుంచి వీలైనంత వరకు రక్షణ లభిస్తుంది. కానీ.. ఏం జరిగిందో ఏమో.. నెట్‌వర్క్‌తో పాటు.. పలు ప్రభుత్వ కార్యాలయాల కంప్యూటర్లు హ్యాకింగ్ గురైయ్యాయు.. ఎవరు చేశారు? ఎక్కడి నుంచి చేశారు? అన్న సమాచారం..!
డేటా హ్యాకింగ్
Last Updated : Jan 6, 2023, 10:34 AM IST